logo

నాలుగేళ్ల కిందట వృద్ధురాలి అదృశ్యం

నాలుగేళ్ల కిందట తప్పిపోయిన తల్లి జాడ తెలియడంతో కుమారుడు భారత్, బంగ్లాదేశ్‌ సరిహద్దులకు వెళ్లారు.. అక్కడ ఆమె ఆచూకీ తెలుసుకుని తన ఇంటికి తీసుకొస్తున్నారు. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. మల్దకల్‌ మండలం

Published : 25 Sep 2022 04:08 IST

అసోంలోని ఆశ్రమంలో తల్లిని కలుసుకున్న కుమారుడు


నాగేశమ్మ

మహబూబ్‌నగర్, ఈనాడు డిజిటల్‌: నాలుగేళ్ల కిందట తప్పిపోయిన తల్లి జాడ తెలియడంతో కుమారుడు భారత్, బంగ్లాదేశ్‌ సరిహద్దులకు వెళ్లారు.. అక్కడ ఆమె ఆచూకీ తెలుసుకుని తన ఇంటికి తీసుకొస్తున్నారు. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. మల్దకల్‌ మండలం కుర్తిరావులచెర్వు గ్రామానికి చెందిన నాగేశమ్మకు మతి స్థిమితం లేదు. ఈ నేపథ్యంలో ఇళ్లు విడిచి వెళ్లిపోయింది. తల్లి జాడ కోసం కుమారులు వెతికినా ఫలితం లేకుండా పోయింది. రెండు రోజుల కిందట అసోం రాష్ట్ర పరిధిలోని ఓ ఆశ్రమంలో భారత్, బంగ్లాదేశ్‌ సరిహద్దులో ఉన్నట్లు సమాచారం వచ్చింది. అక్కడ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఆర్మీ జవాను రాజు ఆమె గురించి తెలుసుకుని హైదరాబాద్‌లో తనకు తెలిసిన వారికి సమాచారం ఇచ్చారు.  వారి ద్వారా విషయం తెలిసి పెద్ద కుమారుడు వెంకటన్న ఆమెను తీసుకుని రావడానికి వెళ్లారు. శనివారం అసోంలోని కాచర్‌ జిల్లా ఉత్తర్‌ బారిక్‌నగర్‌లోని వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిని కలుసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని