Politics news: బండి సంజయ్‌ది పాదయాత్ర కాదు..విషయాత్ర :భట్టి విక్రమార్క

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ చేసిన పాదయాత్ర కాదని, విషయాత్ర అని

Published : 25 Sep 2022 16:36 IST

హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ చేసిన పాదయాత్ర కాదని, విషయాత్ర అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. భాజపా అవలంబిస్తు్న్న విధానాల వల్ల సామాన్యులపై ధరల భారం పడుతోందన్నారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. ధరలు నియంత్రణలోకి రావాలంటే భాజపాకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో అధికార తెరాస కూడా పేదల అభ్యున్నతిని గాలికొదిలేసిందని విమర్శించారు. రుణమాఫీ చేయలేదని, 2 పడక గదుల ఇళ్లు ఇవ్వలేదని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని