Telangana News: రాష్ట్ర ప్రభుత్వ పని తీరుకు, చిత్తశుద్ధికి నిదర్శనమిదే: వినోద్‌ కుమార్‌

గడచిన ఐదేళ్లలో వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించినట్లు 

Updated : 26 Sep 2022 06:08 IST

హైదరాబాద్‌: గడచిన ఐదేళ్లలో వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. జాతీయ స్థాయిలో రికార్డు సృష్టిస్తూ ఐదేళ్లలో రూ.1.81 లక్షల కోట్ల సంపదను సృష్టించిన విషయాన్ని ఆర్‌బీఐ తన నివేదికలో పేర్కొందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అంకితభావ పని తీరుకు, చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. 

వ్యవసాయ, అనుబంధ రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధించలేదంటున్న వారు ఆర్‌బీఐ నివేదికలు చూసుకోవాలని వినోద్‌కుమార్‌ అన్నారు. 2017-18లో రూ.95,098 కోట్లుగా ఉన్న ఈ మూడు రంగాల ఉత్పత్తుల విలువ 2021-22 నాటికి ఏకంగా రూ.1,81,702 కోట్లకు పెరిగినట్లుగా ఆర్‌బీఐ వెల్లడించిందని స్పష్టం చేశారు. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తును అందించేందుకు ఏటా రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్న వినోద్ కుమార్.. ఇప్పటివరకు రూ.353 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని