logo

ఇంధనం.. చూసి ఖర్చు పెట్టండి..!

గ్రేటర్‌ పరిధిలో ఇంధన వినియోగం భారీగా పెరుగుతోంది. ఏటా దాదాపు 25శాతం మేర పెరుగుతోందని ఆయిల్‌ కంపెనీల అధికారులు చెబుతున్నారు. డీజిల్‌ వినియోగంలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉండగా..పెట్రోల్‌ వినియోగంలో

Published : 26 Sep 2022 02:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలో ఇంధన వినియోగం భారీగా పెరుగుతోంది. ఏటా దాదాపు 25శాతం మేర పెరుగుతోందని ఆయిల్‌ కంపెనీల అధికారులు చెబుతున్నారు. డీజిల్‌ వినియోగంలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉండగా..పెట్రోల్‌ వినియోగంలో హైదరాబాద్‌ ముందుంది. గతేడాది గ్రేటర్‌ పరిధిలో పెట్రోల్‌ వినియోగం 44,101.5 కిలోలీటర్లు ఉండగా...ఈ ఏడాది 29శాతం వినియోగం పెరిగింది. డీజిల్‌ గతేడాది 57,512.96 కిలోలీటర్లు ఉండగా.. ప్రస్తుతం 17శాతం పెరిగింది. ఈ క్రమంలో నగరంలో ఇంధన వినియోగానికి కారణాలు, పరిష్కార మార్గాలను ఆయిల్‌ కంపెనీల అధికారులు సూచించారు.

సాధారణంగా వాహనాన్ని 2 నిమిషాలు ఆన్‌లో ఉంచితే 30 నుంచి 40 మిల్లీలీటర్ల ఇంధనం ఖర్చవుతుంది. ఏసీ వినియోగిస్తే మరింత ఖర్చవుతుంది. ట్రాఫిక్‌ కూడళ్లలో ఇంజిన్‌ ఆన్‌ చేయడం ద్వారా ఎంత మేర ఇంధనం నెలలో ఖర్చవుతుందో వాహనాల పరంగా ఎవరికి వారు అంచనా వేసుకోవచ్ఛు ఆర్టీసీ బస్సులు బస్టాపుల్లో కాకుండా రోడ్డుపైనే నిమిషం పాటు ఆపేయడంతో వెనుక వందలాది వాహనాలు నిలిచిపోతున్నాయి. ఆ వ్యవధిలో లీటర్ల మేర ఇంధనం ఖర్చవుతోంది. గ్రేటర్‌ పరిధిలోని 150 ప్రధాన కూడళ్లల్లో టైమర్లు లేకపోవడం, కొన్నిచోట్ల ఉన్నా అవి పనిచేయడం లేదని గుర్తించారు. డీజిల్‌ వాహనాల్లో లీకేజీలు సమస్యగా ఉన్నాయి. సెకన్‌కు ఒక డీజిల్‌ చుక్క కోల్పోతే అది ఏడాదికి 2వేల లీటర్లు అవుతుంది. ఈనేపథ్యంలో లీకేజీల్లేకుండా చూసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని