logo

తీగల వంతెనపై సైక్లిస్టుల సందడి

సైక్లింగ్‌ను నగరంలో మరింతగా ప్రోత్సహించేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ అన్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో ప్రభుత్వం 23 కిలోమీటర్ల సైక్లింగ్‌ ట్రాక్‌ నిర్మాణానికి

Published : 26 Sep 2022 02:50 IST

మాదాపూర్‌, న్యూస్‌టుడే: సైక్లింగ్‌ను నగరంలో మరింతగా ప్రోత్సహించేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ అన్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో ప్రభుత్వం 23 కిలోమీటర్ల సైక్లింగ్‌ ట్రాక్‌ నిర్మాణానికి చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ పలువురు సైక్లిస్టులు ‘‘హైదరాబాద్‌ సైక్లింగ్‌ రెవల్యూషన్‌ 2.0’’ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి సైక్లిస్టులు దుర్గంచెరువు కేబుల్‌ వంతెన మీదకు చేరుకొని సందడి చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అర్వింద్‌కుమార్‌ మాట్లాడుతూ వచ్చే ఏడాది తొలినాళ్లలో ట్రాక్‌ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సైకిల్‌పై అర్వింద్‌ కుమార్‌​​​​​​​

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని