logo

కష్టాలు తెలుసుకుని.. మనోధైర్యం నింపి

క్యాన్సర్‌తో ప్రాణాంతక పరిస్థితిల్లో ఉన్న బాధితులకు సేవలందించే ఖాజాగూడలోని స్పర్శ్‌ హాస్పిస్‌ పాలియేటివ్‌ కేర్‌ (సాంత్వన చికిత్స) సెంటర్‌ను ఆదివారం ప్రముఖ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ సందర్శించారు. కేంద్రంలోని వార్డుల్లో తిరిగి సేవలు

Published : 26 Sep 2022 02:50 IST

స్పర్శ్‌ హాస్పిస్‌ కేంద్రంలో క్యాన్సర్‌ బాధితులతో మాట్లాడుతున్న గావస్కర్‌

రాయదుర్గం, న్యూస్‌టుడే: క్యాన్సర్‌తో ప్రాణాంతక పరిస్థితిల్లో ఉన్న బాధితులకు సేవలందించే ఖాజాగూడలోని స్పర్శ్‌ హాస్పిస్‌ పాలియేటివ్‌ కేర్‌ (సాంత్వన చికిత్స) సెంటర్‌ను ఆదివారం ప్రముఖ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ సందర్శించారు. కేంద్రంలోని వార్డుల్లో తిరిగి సేవలు పొందుతున్న బాధితులతో ఆయన మాట్లాడారు. వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. మృత్యువుతో పోరాడుతున్న బాధితులను చూసి చలించిపోయారు. ఆ కేంద్రంలో బాధలో లేని వారంటూ లేరని అన్నారు. వారిని ప్రేమతో అక్కున చేర్చుకుని సేవలందిస్తున్న సిబ్బంది, నర్సులు, వైద్యులు, రోటరీ క్లబ్‌ సభ్యులను ఆయన ప్రశంసించారు. బంజారాహిల్స్‌ రోటరీ క్లబ్‌ సభ్యులకు ఆయన ప్రశంసాపత్రాలను అందజేశారు. స్పర్శ్‌ హాస్పిస్‌ ట్రస్టీ జగదీష్‌ రామడుగు, కేంద్రం అధ్యక్షుడు ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని