logo

వరద తగ్గినా... ఇబ్బందులేనా...

ధారూర్‌ మండల పరిధి ధారూర్‌ స్టేషన్‌ సమీపంలో దోర్నాల్‌ వాగుపై అసంపూర్తి వంతెన కారణంగా ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉద్ధృతంగా పొంగి పొర్లడంతో దోర్నాల్‌ వాగుపై తాత్కాలికంగా రాకపోకల

Published : 26 Sep 2022 02:50 IST

కొట్టుకుపోయిన రోడ్డుపై నుంచి అవస్థలు పడుతూ వస్తున్న వాహనదారులు

ధారూర్‌: ధారూర్‌ మండల పరిధి ధారూర్‌ స్టేషన్‌ సమీపంలో దోర్నాల్‌ వాగుపై అసంపూర్తి వంతెన కారణంగా ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉద్ధృతంగా పొంగి పొర్లడంతో దోర్నాల్‌ వాగుపై తాత్కాలికంగా రాకపోకల కోసం ఏర్పాటుచేసిన రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. రెండు నెలలుగా వివిధ గ్రామాల ప్రజలు రాకపోకలకు పాట్లు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అసంపూర్తి వంతెన నిర్మాణం పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో రాకపోకలు సాగించేందుకు తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేయక పోవడంతో గతంలో ఏర్పాటుచేసిన పైపుల మీద నుంచే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డును సరిచేసి రాకపోకలు సజావుగా సాగేలా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని