logo

ఆధార్‌ అనుసంధానం.. 50 శాతమే..

జిల్లాలో బోగస్‌ కార్డులను, ఒక్కరే రెండు చోట్ల ఓటు ఉన్న ఓటర్లు గుర్తింపు కార్డులను గుర్తించి తొలగించేందుకు చేపట్టిన ఆధార్‌ అనుసంధానం కార్యక్రమం ఇప్పటివరకు 50 శాతం మేర మాత్రమే పూర్తి చేశారు. ఈ ప్రక్రియను ఆగస్టు 1 నుంచి ప్రారంభించారు.

Published : 26 Sep 2022 02:50 IST

రెవెన్యూ సమ్మెతో ఆగుతూ.. సాగుతూ..

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ

గోడ పత్రికను ఆవిష్కరిస్తున్న అధికారులు

జిల్లాలో బోగస్‌ కార్డులను, ఒక్కరే రెండు చోట్ల ఓటు ఉన్న ఓటర్లు గుర్తింపు కార్డులను గుర్తించి తొలగించేందుకు చేపట్టిన ఆధార్‌ అనుసంధానం కార్యక్రమం ఇప్పటివరకు 50 శాతం మేర మాత్రమే పూర్తి చేశారు. ఈ ప్రక్రియను ఆగస్టు 1 నుంచి ప్రారంభించారు. ఇప్పటి వరకు 1130 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 50 శాతం ఓటరు కార్డులకు అనుసంధానం చేశారు. వాస్తవానికి ఈ పాటికే వంద శాతం పూర్తికావాల్సి ఉన్నా రెవెన్యూ సమ్మె కారణంగా పరిశీలన నెమ్మది నెమ్మదిగా సాగుతోందని అధికారులు వివరిస్తున్నారు.

క్షేత్ర స్థాయిలో సిబ్బంది లేక...

ఈనెల 23 వరకు 4,37,161 మంది మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని, మరణించిన వారిని గుర్తించి తొలగించారు. కొందరు ఆధార్‌ అనుసంధానం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు.

క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే వీఆర్‌ఏలు 60 రోజులుగా సమ్మెలో ఉన్నారు. కొంతమందిని ఇతర శాఖలకు బదిలీ చేశారు. దీంతో తగినంత సిబ్బంది లేక ఈ ప్రక్రియ నత్తనడక నడుస్తుంది. ప్రస్తుతం 1130 మంది బూత్‌స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.

త్వరలోనే పూర్తి చేస్తాం: రవీందర్‌ దత్తు, ఎలక్షన్‌ సెల్‌ ఇన్‌ఛార్జి

జిల్లాలో ఇప్పటి వరకు 50 శాతం ఓటరు కార్డుతో ఆధార్‌ కార్డును అనుసంధానం చేశాం. మిగిలిన 50 శాతం త్వరలోనే పూర్తి చేస్తాం. జిల్లాలోని ప్రతి ఒక్క ఓటరు ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు