logo

గుడుంబా... కట్టడికి కార్యాచరణ

దసరా పండగను పురస్కరించుకుని జిల్లాలోని తండాల్లో గిరిజనులు గుడుంబా తయారు చేసి నిల్వ ఉంచుతున్నారు. దీనిని పండగకు రెండు రోజుల ముందు నుంచి విక్రయిస్తారు. కనుము నాడు వీటి విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. మద్యం కంటే

Published : 26 Sep 2022 02:50 IST

పోలీసుల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేస్తున్న గిరిజనులు

న్యూస్‌టుడే, తాండూరు: దసరా పండగను పురస్కరించుకుని జిల్లాలోని తండాల్లో గిరిజనులు గుడుంబా తయారు చేసి నిల్వ ఉంచుతున్నారు. దీనిని పండగకు రెండు రోజుల ముందు నుంచి విక్రయిస్తారు. కనుము నాడు వీటి విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. మద్యం కంటే తక్కువ ధరకు లభ్యమయ్యే సారాలో మత్తు ఎక్కువగా ఉండడంతో చాలా మంది అటు వైపు దృష్టిని సారిస్తారు. మరో వెపు రాష్ట్రంలో గుడుంబా తయారీ, నిల్వ చేయడంపై నిషేధం ఉంది. అయినా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా ఆబ్కారీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తండాలపై బృందాలుగా దాడులు చేసి సారా తయారీని కట్టడి చేస్తున్నారు. గుడుంబా తయారీలో వినియోగమయ్యే నవాసారం, బెల్లం పాకం నిల్వలను గుర్తించి ఎక్కడికక్కడ పార బోస్తున్నారు. నిల్వచేసిన వారిపై కేసులను నమోదు చేస్తున్నారు.

ఎన్‌ఫోర్స్‌ మెంటు పోలీసులతో కలిసి..: జిల్లాలోని తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌, మోమిన్‌పేట ఆబ్కారీ సర్కిల్‌ పోలీసులు ఎన్‌ఫోర్స్‌మెంటు పోలీసులతో కలిసి గుడుంబా తయారీని కట్టడి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఆమేరకు తండాలకు వెళుతున్నారు. కర్ణాటక రాష్ట్రానికి సరహద్దులో ఉన్న ఓంలానాయక్‌ తండా, రచ్చకట్ట తండా, జయరాం తండా, పాషాపూరు, ఊరెంటి తండా, సిద్దణ్ణ మదుగు వంటి తండాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వీటికి తోడు జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో గుడుంబా తయారు చేయవచ్చనే అనుమానంతో నిఘా వేశారు. తండాల శివారులో గుడుంబా తయారీకి వినియోగించే బట్టీలను ధ్వంసం చేస్తున్నారు.

అవగాహన సదస్సులు..: గుడుంబా తయారీ, విక్రయాలు చేపడితే జరిగే పరిణామాలపై ఆబ్కారీ పోలీసులు గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు. సదస్సులు నిర్వహించి ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. పీడి యాక్టు కేసు నమోదు చేయడంతో పాటు రూ.2లక్షల జరిమాన ఉంటుందని వివరిస్తున్నారు. గుడుంబా విక్రయాలు, తయారీ చేపట్టి కటకటాల పాలు కారాదని తాండూరు ఆబ్కారీ సీఐ చంద్రకాంత్‌రెడ్డి తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts