logo

చిలకమర్తి గొప్ప ఆధునిక సాహిత్యకారుడు

చిలకమర్తి లక్ష్మీనరసింహం గొప్ప ఆధునిక సాహిత్యకారుడని రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డా.వకుళాభరణం కృష్ణమోహన్‌ కొనియాడారు. ఆదివారం త్యాగరాయ గానసభ నిర్వహణలో కళాసుబ్బారావు కళావేదికలో ప్రముఖ సాహితీవేత్త చిలకమర్తి

Published : 26 Sep 2022 02:40 IST

మాట్లాడుతున్న వకుళాభరణం కృష్ణమోహన్‌, చిత్రంలో శ్రీలతావర్మ,

వైఎస్సార్‌ మూర్తి, కళాజనార్దనమూర్తి, మాణిక్‌

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: చిలకమర్తి లక్ష్మీనరసింహం గొప్ప ఆధునిక సాహిత్యకారుడని రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డా.వకుళాభరణం కృష్ణమోహన్‌ కొనియాడారు. ఆదివారం త్యాగరాయ గానసభ నిర్వహణలో కళాసుబ్బారావు కళావేదికలో ప్రముఖ సాహితీవేత్త చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బహుజన వర్గాల్లో విద్యావ్యాప్తికి, ఆధునిక భావాలతో సాహిత్యాన్ని వెలువరించిన కవి, రచయిత అని పేర్కొన్నారు. ఆయన వెలువరించిన సాహిత్యం నాటి సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసిందన్నారు. పాఠశాలను ఆరంభించి సొంత డబ్బుతో నిమ్న వర్గాలకు విద్యాబుద్ధులు నేర్పిన మహనీయుడని ప్రశంసించారు. గానసభ అధ్యక్షుడు కళాజనార్దనమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌ మూర్తి, మాణిక్‌, శ్రీలతావర్మ, బండి శ్రీనివాస్‌, ఎస్బీ రామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని