logo

‘ప్రపంచంలో ఎక్కడాలేని పూల ఉత్సవం బతుకమ్మ’

ప్రపంచంలో ఎక్కడాలేని పూల ఉత్సవం బతుకమ్మ పండగ అని నిమ్స్‌ లైజన్‌ అధికారి డాక్టర్‌ మార్త రమేష్‌ అన్నారు. రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ విశ్వవిద్యాలయంలో తెలంగాణ పోయెట్రీ ఫెస్టివల్‌ కార్యక్రమానికి ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా

Published : 26 Sep 2022 02:40 IST

పుస్తకాన్ని విడుదల చేస్తున్న కవులు

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: ప్రపంచంలో ఎక్కడాలేని పూల ఉత్సవం బతుకమ్మ పండగ అని నిమ్స్‌ లైజన్‌ అధికారి డాక్టర్‌ మార్త రమేష్‌ అన్నారు. రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ విశ్వవిద్యాలయంలో తెలంగాణ పోయెట్రీ ఫెస్టివల్‌ కార్యక్రమానికి ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అన్నవరం దేవేందర్‌ రచించిన ‘ది అన్‌ ఈల్డిండ్‌ స్కై’ ఆంగ్ల అనువాద పుస్తకాన్ని ప్రఖ్యాత కవి వల్లంపట్ల నాగేశ్వర్‌రావుతో కలిసి ఆవిష్కరించారు. దీనిని అనువాదం చేసి డాక్టర్‌ మంథని దామోదరాచారి విశ్వవ్యాప్తం చేశారన్నారు. డాక్టర్‌ పరుశురామారావ, కవులు డాక్టర్‌ దామోదరాచారి, కొండిమల్లారెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని