logo

చిత్ర వార్తలు

Published : 26 Sep 2022 02:40 IST

పురవీధులు.. పూల వనాలు 

నెక్లెస్‌రోడ్డులో భారీ బతుకమ్మ చుట్టూ మహిళల ఆటపాటలు

నగర వీధులన్నీ పూలవనాలయ్యాయి. ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో చూడచక్కగా చేసిన బతుకమ్మల చుట్టూ చేరి బాలికలు, యువతులు, మహిళలు పాటలు పాడుతూ గౌరమ్మను పూజించారు. 

రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకల్లో గవర్నర్‌ తమిళిసైకి తిలకం పెడుతున్న చిన్నారి 

నెక్లెస్‌రోడ్డు జలవిహార్‌లో అతివలు 


అమ్మ సేవకు వేళాయె


దసరా శరన్నవరాత్రులకు నగరంలో ఆలయాలు ముస్తాబయ్యాయి. రోజుకో రూపంలో

అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్‌

పెద్దమ్మ తల్లి ఆలయం విద్యుత్తు కాంతుల్లో తళుకులీనింది.


అభిమానుల ఆసక్తి.. వీరికి భుక్తి

అసలే క్రికెట్‌.. ఆదివారం నగరం ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వేదిక కావడంతో మరింత క్రేజీ ఏర్పడింది. ఈఎస్‌ఐ నుంచి మోతీనగర్‌ దారిలో రాజస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం క్రికెట్‌ బ్యాట్లు తయారు చేసి విక్రయిస్తోంది.  కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు