logo

జేఎన్‌టీయూలో నాలుగుచోట్ల ఏఐఎంఎల్‌ కోర్సు

జేఎన్‌టీయూకు అనుబంధంగా కొనసాగుతున్న నాలుగు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కంప్యూటర్‌ సైన్స్‌లో ప్రత్యేక బ్రాంచీలు అందుబాటులోకి వచ్చాయి. కంప్యూటర్‌ సైన్స్‌తోపాటు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌(ఏఐ-ఎంఎల్‌)

Published : 26 Sep 2022 02:40 IST

ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూకు అనుబంధంగా కొనసాగుతున్న నాలుగు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కంప్యూటర్‌ సైన్స్‌లో ప్రత్యేక బ్రాంచీలు అందుబాటులోకి వచ్చాయి. కంప్యూటర్‌ సైన్స్‌తోపాటు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌(ఏఐ-ఎంఎల్‌) కోర్సులకు విద్యార్థులు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టుగా సీఎస్‌ఈ-ఏఐఎంఎల్‌ కోర్సును జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లో తీసుకొచ్చింది. హైదరాబాద్‌, మంథని, సుల్తాన్‌పూర్‌, వనపర్తిలో 60చొప్పున సీట్లతో కోర్సు ప్రవేశపెట్టారు. ఇందులో వనపర్తి మినహా మిగిలిన చోట్ల కోర్సును సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విభాగంలో నిర్వహిస్తున్నారు. కొత్త కోర్సుగా సీట్లు పెంచుకునేందుకు అనుమతి లేకపోవడంతో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విభాగంలోనే కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని