logo

నేటి నుంచి ‘బతుకమ్మ ఫిల్మోత్సవ్‌’

తెలంగాణ ఏర్పడిన తరువాత స్థానిక సినీ కళాకారులకు గుర్తింపు, గౌరవం లభిస్తున్నాయని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, ఆబ్కారీ శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ

Published : 26 Sep 2022 02:40 IST

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: తెలంగాణ ఏర్పడిన తరువాత స్థానిక సినీ కళాకారులకు గుర్తింపు, గౌరవం లభిస్తున్నాయని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, ఆబ్కారీ శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న ‘బతుకమ్మ ఫిల్మోత్సవ్‌’ గోడపత్రికను ఆదివారం రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు కలిసి రూపొందించిన చిత్రాలను ఈ ఫిల్మోత్సవ్‌లో ఈనెల 26 నుంచి ప్రతీ రోజు సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి ప్రివ్యూ థియేటర్‌లో ప్రదర్శిస్తామన్నారు. పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, క్రీడాప్రాధికార సంస్థ ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, సాంస్కృతిక శాక సంచాలకులు మామిడి హరికృష్ణ, మంత్రి కార్యాలయం అధికారి సత్యనారాయణ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని