logo

బిడ్డపై ఆధారపడటం ఇష్టం లేక వృద్ధుడి ఆత్మహత్య

ఓవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు కుమార్తెమీద ఆధారపడి బతకడం ఇష్టం లేక ఓ వృద్ధుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా

Published : 26 Sep 2022 02:40 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: ఓవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు కుమార్తెమీద ఆధారపడి బతకడం ఇష్టం లేక ఓ వృద్ధుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా రాయగడ్డకు చెందిన శాంతయ్య(67)కు భార్య బాలయ్మ, కుమారుడు, కుమార్తె సంతానం. భార్య సొంతూరులో ఉంటుండగా శాంతయ్య కొద్దిరోజులుగా ఆనంద్‌బాగ్‌లో కుమార్తె సైదమ్మ వద్ద ఉంటున్నాడు. ఆమె భర్త చనిపోగా ఒక కుమారుడు ఉన్నాడు. ఇళ్లలో పనిచేస్తూ కుమారుడిని పోషించుకుంటుందని, ఆమెపై ఆధారపడి ఉండటం ఇష్టం లేక జీవితంపై విరక్తి చెందాడు. దుకాణానికి వెళ్తున్నానని చెప్పి శనివారం బయటకు వెళ్లిన శాంతయ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం అర్ధరాత్రి గుర్తించిన రైల్వే కీమ్యాన్‌ జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గుర్తింపుకార్డు ఆధారంగా శాంతయ్యగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని