logo

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

ఓ నిర్మాణ రంగ సంస్థ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. పశ్చిమ బెంగాల్‌ నుంచి వచ్చిన ఓ కార్మికుడు మృత్యువాతపడ్డాడు. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్‌ నంబరు 14 నందినగర్‌లో హైదరాబాద్‌ పార్క్‌ పేరుతో

Published : 26 Sep 2022 02:40 IST

బంజారాహిల్స్‌లో పశ్చిమ బెంగాల్‌ కార్మికుడి మృతి

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఓ నిర్మాణ రంగ సంస్థ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. పశ్చిమ బెంగాల్‌ నుంచి వచ్చిన ఓ కార్మికుడు మృత్యువాతపడ్డాడు. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్‌ నంబరు 14 నందినగర్‌లో హైదరాబాద్‌ పార్క్‌ పేరుతో ఆల్‌మెక్‌ ఫాస్కేడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ భారీ నిర్మాణం చేపట్టింది. అయిదునెలల కిందట పశ్చిమ బెంగాల్‌ నుంచి వచ్చి గచ్చిబౌలి సిద్దిఖీనగర్‌లో నివసిస్తున్న రాహుల్‌ అక్తర్‌(19) ఈ సంస్థ వద్ద రెండు నెలలుగా పనిచేస్తున్నారు. శనివారం గాజు ఉత్పత్తులు దించడానికి సరైన పద్ధతులు పాటించకపోవడంతో కార్మికులు పనులు పర్యవేక్షిస్తున్న డీజీఎం ఏఎస్‌ నాగరాజారావు, సేఫ్టీ మేనేజర్‌ ప్రవీణ్‌ల దృష్టికి తీసుకెళ్లారు. గ్లాస్‌ ఉత్పత్తులను దించాల్సిందేనని వారు కార్మికులపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో రాహుల్‌ అక్తర్‌, రాహుల్‌ షేక్‌, సమీర్‌, సర్కార్‌ మరికొందరు గాజు ఉత్పత్తులకు కట్టిన తాడు తొలగించేందుకు ఉపక్రమించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా గాజు సామగ్రి అక్తర్‌పై పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కేర్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాహుల్‌ షేక్‌ ఫిర్యాదుతో పోలీసులు నాగరాజా రావు, ప్రవీణ్‌లపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని