logo

షార్జాలో ఉద్యోగం పేరుతో మోసం

హైదరాబాద్‌ నగరం అమీర్‌పేటలోని డీడీకాలనీకి చెందిన హోప్‌స్టోన్‌ కెరీర్‌ కన్సల్‌టెన్సీ నిర్వాహకుడు కె.అనిల్‌కుమార్‌, ఆయన ఏజెంటు కర్నూలు మండలం శిల్పా టౌన్‌షిప్‌కు చెందిన పి.అర్చనలపై కర్నూలు

Updated : 26 Sep 2022 06:37 IST

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ నగరం అమీర్‌పేటలోని డీడీకాలనీకి చెందిన హోప్‌స్టోన్‌ కెరీర్‌ కన్సల్‌టెన్సీ నిర్వాహకుడు కె.అనిల్‌కుమార్‌, ఆయన ఏజెంటు కర్నూలు మండలం శిల్పా టౌన్‌షిప్‌కు చెందిన పి.అర్చనలపై కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో మోసం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు మండలం సూదిరెడ్డి పల్లెకు చెందిన అజయ్‌కుమార్‌కు అర్చతో అనిల్‌కుమార్‌ పరిచయమయ్యారు. షార్జాలో ఉద్యోగం ఇప్పిస్తామని, రూ.1.70 లక్షలు ఇవ్వాలని చెప్పగా రూ.1.20 లక్షలు ఇచ్చాడు. షార్జాకు వెళ్లగానే సంస్థ ప్రతినిధి వచ్చి కలిసి ఉద్యోగం చేర్పిస్తాడన్నారు. షార్జాకు వెళ్లగా అక్కడ ఎవరూ రాలేదు. అక్కడే ఓ తమిళ వ్యక్తి సాయంతో సంస్థ కార్యాలయాన్ని గుర్తించి నిర్వాహకులను కలవగా, అక్కడేమీ ఉద్యోగాలు లేవన్నారు. కొద్దిరోజులు అక్కడే ఉన్న అజయ్‌కుమార్‌ కుటుంబసభ్యుల సాయంతో ఈ సంవత్సరం ఏప్రిల్‌ 5న తిరిగి వచ్చారు. తనకు జరిగిన మోసంపై కోర్టును ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని న్యాయస్థానం కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసుస్టేషన్‌ పోలీసులను ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు