Jagga Reddy: జగన్‌, షర్మిలపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు సరికాదని తెలంగాణకు చెందిన

Updated : 26 Sep 2022 14:51 IST

హైదరాబాద్‌: విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు సరికాదని తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్‌ఆర్ పేరు పెడుతూ సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు చేసే పనులు ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌, వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

వైఎస్‌ఆర్‌ కుమార్తె అయినంత మాత్రాన విమర్శిస్తే ఊరుకుంటామా?

‘‘వైఎస్‌ షర్మిల పాదయాత్ర నాయకులను తిట్టేందుకు చేస్తున్నారా? నేతలపై వ్యక్తిగతంగా బురద చల్లితే ఎలా? మా దగ్గర కూడా అలాంటివి చాలా ఉంటాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె అయినంత మాత్రాన విమర్శిస్తే ఊరుకుంటామా? తండ్రి బాటలో షర్మిల నడవడం లేదు. ఇంతవరకు ఆమె భాజపాను విమర్శించినట్లు చూడలేదు. ప్రధాని మోదీని షర్మిల ఎందుకు ప్రశ్నించడం లేదు?

గుట్టు రట్టు కాకుండా ఉండేందుకే..

జగన్‌, షర్మిల ఇద్దరూ భాజపా వదిలిన బాణాలే. ఇది ప్యూర్‌ భాజపా డైరెక్షన్‌. మోదీ, అమిత్‌షా చెప్పినట్లు వాళ్లు పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రాంత ప్రజల ఓటు బ్యాంకు చీల్చి భాజపాకు ఉపయోగపడాలనేది వారిద్దరి రాజకీయ వ్యూహం. అడ్డగోలుగా సంపాదించి వాళ్ల గుట్టు రట్టు కాకుండా ఉండేందుకు భాజపా కంట్రోల్‌లో పనిచేస్తున్నారు’’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. 

మూడు రాజధానులతో అభివృద్ధి సాధ్యంకాదు

ఏపీకి రాజధానిగా అమరావతే ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించిందని జగ్గారెడ్డి గుర్తుచేశారు. మూడు ప్రాంతాల్లో 3 రాజధానుల నిర్ణయం సరికాదని.. దీని వల్ల అభివృద్ధి సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సీఎం జగన్‌ తీసుకున్నది తప్పుడు నిర్ణయమని ఆరోపించారు. అమరావతిపై చంద్రబాబు విస్తృత దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని