logo

నాలాలు.. డ్రెయిన్లు ఏకమై..రోడ్లు కాల్వలై

రాజధానిలో పది సెం.మీ. లోపు వర్షానికే రోడ్లు కాల్వలను తలపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం 5.30 గంటల తర్వాత గంటపాటు కుంభవృష్టి కురిసింది. ప్రధాన రోడ్లపై వాహనదారులు చిక్కుకుపోయారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు నగర ట్రాఫిక్‌ సహాయ కమిషనర్‌

Updated : 27 Sep 2022 04:58 IST

ఉస్మాన్‌గంజ్‌లో మ్యాన్‌హోల్‌ తెరుస్తున్న సిబ్బంది

రాజధానిలో పది సెం.మీ. లోపు వర్షానికే రోడ్లు కాల్వలను తలపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం 5.30 గంటల తర్వాత గంటపాటు కుంభవృష్టి కురిసింది. ప్రధాన రోడ్లపై వాహనదారులు చిక్కుకుపోయారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు నగర ట్రాఫిక్‌ సహాయ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. నాలాలు, డ్రెయిన్లు కలిసిపోవడం వల్లే సమస్య అని గుర్తించింది. ఆధునికీకరణకు గత పదిహేనేళ్లుగా నిధులు కేటాయించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడుతోంది.          
ఈ ప్రాంతాల్లో నరకం
* ఉస్మాన్‌గంజ్‌ మార్కెట్‌ నీటమునిగింది. అల్లం, ఉల్లి, వెల్లుల్లి సంచులు నీటిపాలయ్యాయి.  
* ఎల్లారెడ్డిగూడ-అమీర్‌పేట్‌ మధ్య రహదారులు జలమయమయ్యాయి. రెండుగంటల పాటు ట్రాఫిక్‌ స్తంభించింది.
* అత్తాపూర్‌ 196 స్తంభం వద్ద రెండు గంటలు ట్రాఫిక్‌ నిలిచిపోయింది.
* ఆరాంఘర్‌ రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద నీరు నిలిచిపోయింది.* ఖైరతాబాద్‌ మెట్రోస్టేషన్‌, రాజ్‌భవన్‌ లేక్‌ వ్యూ అతిథి గృహం దారిలో, చింతల్‌బస్తీ, ఎర్రమంజిల్‌ చౌరస్తా వద్ద వరద చేరింది.* కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రి పాతభవనంలోని ఐసీయూ క్యాజువాలిటీలో పెచ్చులూడిపోయాయి. రోగులను మరో భవనానికి తరలించారు.* మెహదీపట్నం భోజగుట్ట శివాజీనగర్‌లో ప్రహరీ కూలిన ఘటనలో ప్రమాదం తప్పింది.* మాసబ్‌ట్యాంక్‌ పైవంతెన వద్ద కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.


ఖైరతాబాద్‌లో నిలిచిన నీటిలో భారీగా స్తంభించిన ట్రాఫిక్‌

సికింద్రాబాద్‌ మినహా...  
ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ మినహా నగరవ్యాప్తంగా వరణుడు విరుచుకుపడ్డాడు. ‘బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు 12 నుంచి బషీరాబాగ్‌కు సుమారు 7 కి.మీ. దూరం. మామూలు రోజుల్లో 25-30 నిమిషాల్లో వెళ్లొచ్చు. సోమవారం వర్షం పడిన తర్వాత కారులో, ఈ మార్గంలో గమ్యస్థానం చేరేందుకు ఓ ఉద్యోగికి ఏకంగా 2 గంటల సమయం పట్టడం గమనార్హం.
సమస్యాత్మక జంక్షన్లు: ఎన్‌ఎండీసీ, మెహిదీపట్నం  రైతు బజార్‌, అత్తాపూర్‌, సుల్తాన్‌బజార్‌, దిల్‌సుఖ్‌నగర్‌, బేగంపేట, పంజాగుట్ట, మైత్రీవనం తదితర ప్రాంతాలు.

 

ఉస్మాన్‌గంజ్‌లో వరద ప్రవాహం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని