logo

నగర వీధుల్లో నరక ప్రయాణం

ఒక్కసారిగా కురిసిన వర్షానికి జనం నరకం అనుభవించారు. 2-4 అడుగుల నీరు ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు.. ఎవరూ బయటకు రావొద్దు.. ఇళ్లల్లోనే ఉండాలంటూ రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రకటించారు. మూసారంబాగ్‌ వంతెన మునిగిపోవడంతో 

Updated : 27 Sep 2022 09:08 IST

ఈనాడు, హైదరాబాద్‌

పబ్లిక్‌గార్డెన్స్‌-మాసాబ్‌ట్యాంక్‌కు గంట
మలక్‌పేట-కోఠీకి 1.15 గంటలు
అపోలో ఆసుపత్రి-పంజాగుట్ట 1.30 గంటలు
నల్లకుంట-అత్తాపూర్‌ 2.45 గంటలు
కుండపోత వర్షానికి సోమవారం ట్రాఫిక్‌ కదిలిందిలా.

ఒక్కసారిగా కురిసిన వర్షానికి జనం నరకం అనుభవించారు. 2-4 అడుగుల నీరు ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు.. ఎవరూ బయటకు రావొద్దు.. ఇళ్లల్లోనే ఉండాలంటూ రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రకటించారు. మూసారంబాగ్‌ వంతెన మునిగిపోవడంతో అంబర్‌పేట, మలక్‌పేట మధ్య రాకపోకలు ఆగిపోయాయి. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి మూసారంబాగ్‌ మీదుగా వెళ్లేవారు మలక్‌పేట కోఠీవైపు రావడంతో మూసారంబాగ్‌ నుంచి కోఠి వరకు వాహనాలు ఆగిపోయాయి. కిలోమీటర్‌ దూరాన్ని దాటేందుకు గంట పట్టింది. జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్‌ రోడ్‌నంబర్‌ 12, కేబీఆర్‌పార్కు వైపు రెండువైపులా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. 

 

నల్లకుంట నుంచి మెహిదీపట్నానికి ఆపసోపాలు
నల్లకుంటలోని ఓ కార్పొరేటు కళాశాలలో చదువుకుంటున్న ఆరుగురు ఇంటర్‌ విద్యార్థులు సాయంత్రం 6.10 గంటలకు ఇళ్లకు వెళ్లేందుకు వ్యాన్‌లో ఎక్కారు. కోరంటి ఆసుపత్రికి రాగానే రహదారులపై వరదనీటి ప్రవాహం అడ్డుకుంది. ముందూ, వెనుక వాహనాలు ఆగిపోయాయి. బషీర్‌బాగ్‌ దాటి పబ్లిక్‌గార్డెన్స్‌కు వచ్చేసరికి 6.55 గంటలైంది. లక్డీకాపూల్‌ వద్ద వరదనీటి ప్రవాహం కారణంగా  అక్కడికికక్కడే ఆగిపోయాయి. మాసాబ్‌ట్యాంక్‌కు చేరుకునే సరికి 7.55 గంటలైంది. అక్కడి నుంచి మళ్లీ మెహదీపట్నం, అత్తాపూర్‌ చేరుకునేందుకు మరో గంట సమయం పట్టింది. దీంతో తల్లిదండ్రులు హైరానా పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని