logo

శంషాబాద్‌ విమానాశ్రయానికి రెండు జాతీయ పురస్కారాలు

శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సిగలో మరో రెండు జాతీయ పురస్కారాలు చేరాయని సోమవారం జీహెచ్‌ఐఏఎల్‌ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ, గోద్రెజ్‌ గ్రీన్‌

Published : 27 Sep 2022 04:08 IST

పురస్కారాలు అందుకున్న జీహెచ్‌ఐఏఎల్‌ అధికారులు

శంషాబాద్‌, న్యూస్‌టుడే: శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సిగలో మరో రెండు జాతీయ పురస్కారాలు చేరాయని సోమవారం జీహెచ్‌ఐఏఎల్‌ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ, గోద్రెజ్‌ గ్రీన్‌ బిజినెస్‌ సంస్థల ప్రతినిధులు సంయుక్తంగా విమానాశ్రయాలు కర్బన ఉద్గారాల నివారణ కోసం అవలంబిస్తున్న విధి విధానాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇటీవల నిర్వహించిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్‌ 21వ ఎడిషన్‌లో శంషాబాద్‌ విమానాశ్రయం నేషనల్‌ ఎనర్జీ లీడర్‌, ఎక్స్‌లెంట్‌ ఎనర్జీ ఎఫిషియెంట్‌ యూనిట్‌ 2022 జాతీయ అవార్డులు గెలుచుకున్నట్లు ప్రకటించారు. వరుసగా నాలుగోసారి వరించిన ఈ పురస్కారాలను జీహెచ్‌ఐఏఎల్‌ చీఫ్‌ ప్రాజెక్టు అండ్‌ ఇంజినీరింగ్‌ అధికారి విజయ్‌ రాథోడ్‌,  ఎయిర్‌పోర్ట్‌ ఎలక్ట్రికల్‌ విభాగం ఏజీఎం భిక్షం భూక్యా అందుకున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని