logo

చట్టసభల్లో రిజర్వేషన్ల సాధనకు జాతీయస్థాయిలో ఉద్యమం

చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధనకు జాతీయస్థాయిలో ఉద్యమం చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. సోమవారం హైదరాబాద్‌ కాచిగూడలోని

Published : 27 Sep 2022 04:35 IST

ఐక్యత చాటుతున్న ఆర్‌.కృష్ణయ్య, తెలంగాణ, ఏపీ బీసీ సంఘాల నేతలు

కాచిగూడ, న్యూస్‌టుడే: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధనకు జాతీయస్థాయిలో ఉద్యమం చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. సోమవారం హైదరాబాద్‌ కాచిగూడలోని హోటల్‌లో ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారేష్‌ అధ్యక్షతన తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధ్యక్ష, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో బీసీ యువజన విభాగం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నెల్లూరుకు చెందిన షేక్‌ అబ్దుల్‌ కలాంను ప్రకటించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, ఏపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వేముల బేబీరాణి, జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి పద్మజ తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని