logo

హైటెక్స్‌లో ప్రపంచ పర్యాటక దినోత్సవ సందడి

ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలతో సోమవారం మాదాపూర్‌ హైటెక్స్‌ ప్రాంగణంలో సందడి కనిపించింది. నోరూరించే వంటకాలు, తెలంగాణ సంస్కృతిని చాటే హస్తకళలు, కళాకృతులు, కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఉల్లాసభరితంగా వేడుక సాగింది.

Published : 27 Sep 2022 04:35 IST

షణ్ముకప్రియ

మాదాపూర్‌, న్యూస్‌టుడే: ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలతో సోమవారం మాదాపూర్‌ హైటెక్స్‌ ప్రాంగణంలో సందడి కనిపించింది. నోరూరించే వంటకాలు, తెలంగాణ సంస్కృతిని చాటే హస్తకళలు, కళాకృతులు, కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఉల్లాసభరితంగా వేడుక సాగింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (నితమ్‌) విద్యార్థులు తయారు చేసిన 76 రకాల బిర్యానీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  బతుకమ్మ ఆటపాట, శాస్త్రీయ, జానపద నృత్యాలతోపాటు నితమ్‌కు చెందిన విదేశీ విద్యార్థులు తమ దేశ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించి ఆట్టుకున్నారు.  ట్రావెల్‌ ఏజెంట్లు, టూర్‌ ఆపరేటర్లు, ట్రావెల్‌ పరిశ్రమలోని అన్ని విభాగాలకు, హోటళ్లు, రెస్టారెంట్లు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి పర్యాటక శాఖ తరఫున టూరిజం ఎక్స్‌లెన్స్‌ పేరిట అవార్డులను అందజేశారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్‌ సుల్తానియా, పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనోహర్‌, నితమ్‌ డైరెక్టర్‌ చిన్నంరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని