logo

సంస్కృతికి ప్రతిబింబం... బతుకమ్మ

తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగను మహిళలు పెద్ద ఎత్తున జరపాలని జిల్లా కలెక్టర్‌ నిఖిల సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మహిళా అధికారులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో

Published : 27 Sep 2022 06:43 IST

బతుకమ్మ సంబురాల్లో కలెక్టర్‌  నిఖిల, ఇతర అధికారులు

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగను మహిళలు పెద్ద ఎత్తున జరపాలని జిల్లా కలెక్టర్‌ నిఖిల సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మహిళా అధికారులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే నెల 3 వరకు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారిణి లలితకుమారి, డీఆర్‌ఓ కృష్ణన్‌, జిల్లా వ్యవయసాధికారి గోపాల్‌, పురపాలక సంఘం కమిషనర్‌ శరత్‌చంద్ర, మహిళా ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

వికారాబాద్‌ కలెక్టరేట్‌: జిల్లాలో ఈనెల 27 నుంచి 30 వరకు నాలుగు రోజుల పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కేజీబీవీ గురుకుల పాఠశాలలు, వసతి గృహ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని పాలనాధికారిణి నిఖిల ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారులు, ప్రాంతీయ, జిల్లా స్థాయి సమన్వయకర్తలతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచటం, విద్యార్థుల ఆరోగ్యం తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. అలాగే వంట కార్మికులకు, వసతి గృహ సంక్షేమాధికారులకు, కార్మికులకు, ప్రిన్సిపాల్స్‌కు శిక్షణ ఇవ్వాలని ఆమె తెలిపారు. జిల్లా సంక్షేమాధికారులు మల్లేశం, సుధారాణి, ఉపేందర్‌, జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని