logo

రుణ మాఫీ ఇంకెప్పుడు: భాజపా

2018 ఎన్నికల సమయంలో తెరాస ప్రభుత్వం ఇచ్చిన రూ.లక్ష అమలుపై నిర్లక్ష్యం వహించడంపై భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ విమర్శించారు. సోమవారం ‘ప్రజాగోస భాజపా భరోసా యాత్ర’లో భాగంగా మండలంలోని బిల్‌కల్‌,

Published : 27 Sep 2022 06:43 IST

బిల్‌కల్‌లో మాట్లడుతున్న రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్‌, మాజీ మంత్రి చంద్రశేఖర్‌

మర్పల్లి, న్యూస్‌టుడే: 2018 ఎన్నికల సమయంలో తెరాస ప్రభుత్వం ఇచ్చిన రూ.లక్ష అమలుపై నిర్లక్ష్యం వహించడంపై భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ విమర్శించారు. సోమవారం ‘ప్రజాగోస భాజపా భరోసా యాత్ర’లో భాగంగా మండలంలోని బిల్‌కల్‌, మొగిలిగుండ్ల, కొంషట్‌పల్లి, పట్లూర్‌, ఘనపూర్‌ తదితర గ్రామాల్లో మాజీ మంత్రి చంద్రశేకర్‌తో కలిసి పర్యటించి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. లక్ష రుణ మాఫీ కోసం నాలుగు సంవత్సరాల నుంచి రైతులకు ఎదురు చూపులు మిగిలిందని, రూణ మాఫీతో ఓట్లు దండుకొని వడ్డీ భారం మోపుతుందన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఎనిమిది ఏళ్లు అవుతున్నా ప్రభుత్వ ఉద్యోగాల సంగతి మరిచారన్నారు. మాజీ మంత్రి చంద్రశేకర్‌ మాట్లాడుతూ...ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మంత్రి పదవికి రాజీనామ చేసిన తననే కేసీఆర్‌ కారణం లేకుండా దూరం పెట్టారన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు సధానందరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి విఠల్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివరాజ్‌, మండల పార్టీ మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని