logo

Crime News: నయీం అనుచరుడు శేషన్న అరెస్టు

కరడు కట్టిన నేరగాడు, మాజీ నక్సలైట్‌ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు అరెస్టు చేశారు. ఆయుధాల కేసులో శేషన్నను అరెస్టు...

Updated : 28 Sep 2022 04:34 IST

హైదరాబాద్: కరడు కట్టిన నేరగాడు, మాజీ నక్సలైట్‌ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు అరెస్టు చేశారు. ఆయుధాల కేసులో శేషన్నను అరెస్టు చేసినట్లు పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ ప్రకటించారు. అతడి నుంచి ఓ పిస్తోలు, 5 రౌండ్ల తూటాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో నయీంతో కలిసి శేషన్న అనేక బెదిరింపులకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. హత్యలు, భూ సెటిల్‌మెంట్లు చేశాడు. శేషన్నపై ఇప్పటివరకు 9 కేసులు ఉన్నాయని, ఐపీఎస్ అధికారి కేఎస్‌ వ్యాస్ హత్య కేసులోనూ నిందితుడని డీసీపీ జోయల్ డేవిస్ పేర్కొన్నారు. 2016లో షాద్‌నగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నయీం మరణించాడు. అప్పటి నుంచి శేషన్న పరారీలో ఉన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని