logo

కమనీయం.. నృత్యోత్సవం

తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాల్లో భాగంగా రవీంద్రభారతి ప్రధాన మందిరంలో నిర్వహిస్తున్న ‘దేవి వైభవ నృత్యోత్సవం’ ప్రేక్షకులకు కనువిందు

Published : 28 Sep 2022 02:39 IST

రవీంద్రభారతి, న్యూస్‌టుడే:  తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాల్లో భాగంగా రవీంద్రభారతి ప్రధాన మందిరంలో నిర్వహిస్తున్న ‘దేవి వైభవ నృత్యోత్సవం’ ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది. మంగళవారం నాట్య గురువులు మంజుల రామస్వామి, పసుమర్తి రామలింగశాస్త్రి తమ శిష్యబృందంతో కూచిపూడి, భరతనాట్యం, పేరిణి ప్రకాష్‌ పేరిణి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, సంగీత నాటక అకాడమీ ఛైర్మన్‌ దీపికారెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సంగీత నాటక అకాడమీ కార్యదర్శి వసుంధర పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని