logo

జడివాన.. హైరానా

రాజధానిలో వరుణుడు రెండో రోజూ బీభత్సం సృష్టించాడు. హయత్‌నగర్‌ మండలం భవానీనగర్‌లో మంగళవారం రాత్రి 8గంటల సమయానికి 6సెం.మీ గరిష్ఠ వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం 2.40గంటల నుంచి సాయంత్రం 6

Updated : 28 Sep 2022 04:59 IST

దారులు దిగ్బంధం.. వాహనదారులకు తిప్పలు

మలక్‌పేటలో గోడ కూలి ఆటోడ్రైవర్‌ మృతి

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో వరుణుడు రెండో రోజూ బీభత్సం సృష్టించాడు. హయత్‌నగర్‌ మండలం భవానీనగర్‌లో మంగళవారం రాత్రి 8గంటల సమయానికి 6సెం.మీ గరిష్ఠ వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం 2.40గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. నిమిషాల్లోనే ప్రధాన రహదారులపై మోకాల్లోతున నీరు నిలిచింది. కార్లు, ద్విచక్ర వాహనాలు వరదలో చిక్కుకున్నాయి.  ఎల్బీనగర్‌ నుంచి ఆటోనగర్‌ వరకు విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. హయత్‌నగర్‌లోని కమలానగర్‌లో ఇంటి బాల్కనీ కూలి శిథిలాలు పడటంతో ఓ ద్విచక్ర వాహనం ధ్వంసమైంది. భోజగుట్టలో ఓ ఇంటి ప్రహరీ, సమీపంలోని మంగార్‌బస్తీలో ఇంటి గోడలు నేల కూలాయి.  ఓల్డ్‌మలక్‌పేట డివిజన్‌ వాహెద్‌నగర్‌ ఎజాజ్‌ కేబుల్‌ లేన్‌లో ఉండే ఆటోడ్రైవర్‌ మహమ్మద్‌ మక్బూల్‌(41) మంగళవారం ఉదయం ఇంటి ముందు ఆటోకు మరమ్మతులు చేస్తుండగా ప్రహరీ కూలీ మీద పడడంతో మృతి చెందాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని