logo

మూగబోయిన మిమిక్రీ గొంతు

ఈటీవీ జబర్దస్త్‌ కార్యక్రమంలో నవ్వులు పండించిన మిమిక్రీ మూర్తి అలియాస్‌ కొమ్ము నరసింహ మూర్తి(44) గొంతుక మూగబోయింది. కొన్నేళ్లుగా క్యాన్సర్‌ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం కన్నుమూశారు.

Published : 28 Sep 2022 02:39 IST

మూర్తి

వరంగల్‌, న్యూస్‌టుడే: ఈటీవీ జబర్దస్త్‌ కార్యక్రమంలో నవ్వులు పండించిన మిమిక్రీ మూర్తి అలియాస్‌ కొమ్ము నరసింహ మూర్తి(44) గొంతుక మూగబోయింది. కొన్నేళ్లుగా క్యాన్సర్‌ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం కన్నుమూశారు. హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారానికి చెందిన మూర్తి 2013లో ఈటీవీ జబర్దస్త్‌ కార్యక్రమంలో అరంగేట్రం చేశారు. 2017 వరకు అనేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనారోగ్యానికి గురికావడంతో చికిత్సకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన సోదరి ములుగులో ఉండగా, అక్కడ ఉంటూ చికిత్స పొందుతున్నారు. మంగళవారం మృతి చెందడంతో స్వగ్రామానికి తీసుకొచ్చారు. బుధవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts