logo

కొండా లక్ష్మణ్‌బాపూజీ చరిత్రను భావి తరాలకు అందిస్తాం

కొండా లక్ష్మణ్‌బాపూజీ రాష్ట్రానికే కాదూ.. దేశానికే నాయకుడు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 107వ

Published : 28 Sep 2022 02:39 IST

మంత్రి గంగుల కమలాకర్‌

రవీంద్రభార[తి, న్యూస్‌టుడే: కొండా లక్ష్మణ్‌బాపూజీ రాష్ట్రానికే కాదూ.. దేశానికే నాయకుడు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 107వ జయంతి ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌, ఆహ్వాన కమిటీ అధ్యక్షులు చింత ప్రభాకర్‌ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. లక్ష్మణ్‌బాపూజీ నిలువెత్తు విగ్రహం ప్రతిష్ఠించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఆ మహనీయుడి చరిత్రను భవిష్యత్‌ తరాలకు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ.. కోకాపేటలో పద్మశాలీల ఆత్మగౌరవ భవనానికి ముఖ్యమంత్రి రెండున్నర ఎకరాల స్థలం, నిర్మాణానికి రూ.5 కోట్లు ఇచ్చారన్నారు. చింత ప్రభాకర్‌ మాట్లాడుతూ.. భవన నిర్మాణానికి అదనంగా మరో రూ.15 కోట్లు ఇప్పించాలన్నారు. తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోశిక యాదగిరి, బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. బాపూజీ బహుజన నేత అని కీర్తించారు. జస్టిస్‌ చంద్రకుమార్‌, ప్రొ.వెంకటరాజయ్యలకు కొండా లక్ష్మణ్‌బాపూజీ స్మారక జీవన సాఫల్య పురస్కారాన్ని మంత్రి ప్రదానం చేశారు. ఎమ్మెల్సీ, ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులు ఎల్‌.రమణ, సభ్యులు సీహెచ్‌ ఉపేంద్ర, కిషోర్‌గౌడ్‌, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్లస్వామి, పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాడం బాబురావు, ఆహ్వాన కమిటీ వైస్‌ఛైర్మన్లు జెల్లా మార్కండేయులు, వనం దుశ్యంతల తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని