logo

అత్యంత ప్రమాదకారి మోదీ: కె.నారాయణ

ఒకనాటి చంబల్‌ లోయలోని దొంగల కంటే నేటి ప్రధాని మోదీ ప్రమాదకారి అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ దుయ్యబట్టారు. పార్టీ జాతీయ మహాసభల కోసం రూపొందించిన పాటల సీడీని మంగళవారం ఆయన

Published : 28 Sep 2022 02:38 IST

పాటల సీడీని ఆవిష్కరిస్తున్న సీపీఐ నేతలు నారాయణ, చాడ, రామకృష్ణ తదితరులు

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: ఒకనాటి చంబల్‌ లోయలోని దొంగల కంటే నేటి ప్రధాని మోదీ ప్రమాదకారి అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ దుయ్యబట్టారు. పార్టీ జాతీయ మహాసభల కోసం రూపొందించిన పాటల సీడీని మంగళవారం ఆయన హిమాయత్‌నగర్‌లోని మఖ్దూంభవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యర్థులను బెదరగొట్టేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను వినియోగించుకుంటున్న ప్రధాని, తన పార్టీలోని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సీనియర్‌ నేత కె.ప్రతాపరెడ్డి, సినీ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌, సీపీఐ, అనుబంధ సంస్థల నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని