రూ.కోట్లు కూడబెట్టాలని దోపిడీలు!

అడ్డదారిలో సొమ్ము సంపాదించాలి.. షేర్‌మార్కెట్‌లో రూ.కోట్లు కూడబెట్టాలి.. దీనికోసం హత్య, దోపిడీలు, దొంగతనాలు మార్గంగా ఎంచుకున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం

Updated : 28 Sep 2022 04:24 IST

సొత్తు పరిశీలిస్తున్న అదనపు సీపీ ఏ.ఆర్‌.శ్రీనివాస్‌, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: అడ్డదారిలో సొమ్ము సంపాదించాలి.. షేర్‌మార్కెట్‌లో రూ.కోట్లు కూడబెట్టాలి.. దీనికోసం హత్య, దోపిడీలు, దొంగతనాలు మార్గంగా ఎంచుకున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం బషీర్‌బాగ్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి, ఎస్సార్‌నగర్‌ డీఐ రాంప్రసాద్‌తో కలిసి నగర అదనపు సీపీ (క్రైమ్‌, సిట్‌) ఏఆర్‌.శ్రీనివాస్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేరు నివాసి కోనేటి జ్ఞానేశ్వర్‌ (26). 2019లో బీఎస్సీ మధ్యలో ఆపేసి కారు డ్రైవర్‌గా మారాడు. ములుగు జిల్లా వెంకటాపూర్‌కు చెందిన నీలం శ్రీనివాస్‌ (33)  ఖమ్మం జిల్లా జైలులో ఉన్నప్పుడు జ్ఞానేశ్వర్‌తో స్నేహం ఏర్పడింది. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు పెద్దఎత్తున దోపిడీ చేయాలనే పథకం వేశారు.

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ వద్ద జ్యోతిషుడు.. చెలపూరి పెద్దస్వామి పేరు ప్రఖ్యాతల గురించి శ్రీనివాస్‌ విన్నాడు. పెద్దస్వామి వద్ద డబ్బు ఉంటుందని భావించి జ్ఞానేశ్వర్‌తో కలిసి ఆశ్రమానికి వెళ్లారు.  మే 3న అర్ధరాత్రి దాటాక ఇద్దరూ స్వామి గదిలోకి వెళ్లి టవల్‌లో గొంతు నులిమి చంపారు.  సూర్యాపేట్‌లో ద్విచక్ర వాహనం   చోరీ చేశారు. విజయవాడ చేరి 8 గొలుసు చోరీలు చేశారు.  ఇటీవలే నగరానికి చేరిన జ్ఞానేశ్వర్‌, శ్రీనివాస్‌.. చోరీ చేసిన బైకుపై వెళ్తూ ఎస్సార్‌నగర్‌ పరిధిలో ఓ మహిళ మెడలో గొలుసు కొట్టేశారు.  ఎస్సాఆర్‌ నగర్‌ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని