logo

ఆర్టీసీ ప్రయాణికులే లక్ష్యంగా చోరీలు

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల దృష్టి మరల్చి నగదు, చరవాణుల చోరీలకు పాల్పడుతున్న ఏడుగురిని సికింద్రాబాద్‌ పరిధిలోని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌...

Published : 28 Sep 2022 02:38 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల దృష్టి మరల్చి నగదు, చరవాణుల చోరీలకు పాల్పడుతున్న ఏడుగురిని సికింద్రాబాద్‌ పరిధిలోని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సాయిఈశ్వర్‌గౌడ్‌, డీఐ కోటయ్యల కథనం ప్రకారం... ఫంక్షన్‌ హాళ్లలో లేబర్‌గా పనిచేసే వెస్ట్‌మారేడుపల్లి సంజీవ్‌నగర్‌ వాసి సందీప్‌ బహదూర్‌(26), తాండూరు కోకట్‌ గ్రామం వాసి కర్నె పెంటప్ప(21), వరంగల్‌ మహబూబాబాద్‌ ఆర్టీసీ కాలనీ వాసి బనోతు విక్రమ్‌ నాయక్‌(23), బన్సీలాల్‌పేట్‌ సీసీనగర్‌ వాసి ఆటోడ్రైవర్‌ కొత్తపల్లి శ్యామ్‌(24), షాపూర్‌నగర్‌, గాజుల రామారం వాసి, డ్రైవర్‌గా పనిచేసే మహమ్మద్‌ షకీల్‌(33), ప్లంబర్‌గా పనిచేసే ఎల్‌బీనగర్‌ వాసి బెజవాడ గణేష్‌ అలియాస్‌ ధర్మ(21), వెస్ట్‌మారేడుపల్లి వాసి అల్లూరి దిలీప్‌రాజ్‌(21)లు స్నేహితులుగా మారి ముఠాగా ఏర్పడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో  ప్రయాణికులను దృష్టి మరల్చి.. వారి నగదు, చరవాణులను చోరీలు చేస్తున్నారు. సందీప్‌ బహదూర్‌, కర్నెపెంటప్ప, బానోతు విక్రమ్‌, కొత్తపల్లిశ్యామ్‌లు గతంలో పలు కేసుల్లో జైలు వెళ్లి వచ్చారు. నగరంలో ఉంటూ క్యాటరింగ్‌ పనిచేస్తున్న బానోత్‌ వాసు ఈనెల 24న  సికింద్రాబాద్‌ గురుద్వారా బస్టాప్‌ వద్ద దిగుతుండగా జేబులో రూ.5వేలు చోరీకి గురయ్యాయి. ఇలా పలువురి ఫిర్యాదులతో వీరిని అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని