logo

మాటలతో మభ్యపెట్టి.. లక్షలు కొల్లగొట్టి..

బంగారం అమ్ముతామంటూ మాటలతో మభ్యపెట్టి.. రూ.60 లక్షలు కొట్టేసిన ఎనిమిది మందిని ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ, సరూర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.45.10 లక్షల నగదు, 13 ఫోన్లు, ఒక కారు,

Published : 28 Sep 2022 02:38 IST

ఈనాడు, హైదరాబాద్‌:  బంగారం అమ్ముతామంటూ మాటలతో మభ్యపెట్టి.. రూ.60 లక్షలు కొట్టేసిన ఎనిమిది మందిని ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ, సరూర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.45.10 లక్షల నగదు, 13 ఫోన్లు, ఒక కారు, ద్విచక్రవాహనం, సూట్‌కేసును స్వాధీనం చేసుకున్నారు.  కేసు వివరాలను కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ మంగళవారం విలేకర్లకు చెప్పారు. హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన మహేశ్‌(35).. ఎల్బీనగర్‌లో నివాసముండే రియాజ్‌ అలియాస్‌ అనిల్‌(30)స్నేహితులు. నెలక్రితం రియాజ్‌ ఏపీలోని బాపట్లకు చెందిన వినేశ్‌కుమార్‌ అలియాస్‌ రాజిరెడ్డి(47)ని కలిశారు. దృష్టి మరల్చి డబ్బు లాగడంతో వినేశ్‌ దిట్ట. డబ్బుకు ఆశపడ్డ మహేశ్‌ వారితో కలిశాడు. సరూర్‌నగర్‌కు చెందిన వ్యాపారి తాళ్లూరి వెంకటేశ్వరరావును(49) మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు. వీరి మాటలు నమ్మిన వెంకటేశ్వరరావు రూ.60 లక్షలకు కిలోన్నర బంగారం కొంటానని చెప్పాడు.  అనంతరం వినేశ్‌కుమార్‌.. విశాఖకు చెందిన కర్రి కనకారావు(52), విజయవాడకు చెందిన ఉడుత రవి(40), నెల్లూరుకు చెందిన ప్రసన్నకు చెప్పాడు.  

డబ్బు బదులు రంగు కాగితాలు.. ఈ నెల 20వ తేదీన దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో దగ్గర మహేశ్‌, రియాజ్‌, సురేందర్‌, రవి ఉండగా.. సూట్‌కేసులు మార్చడంలో సిద్ధహస్తుడైన కర్రి కనకారావు, ప్రసన్న ఆటోలో బాధితుడి ఇంటికి వెళ్లారు. బంగారం మరో వ్యక్తి తెస్తున్నాడని.. ఆ లోపు డబ్బు చూపించాలని కోరారు. మొత్తం లెక్కపెట్టి చిన్న బ్యాగులో సర్ది.. తమ వద్ద ఉన్న రెండు అరల సూట్‌కేసులో పెట్టారు.   ఇదే సమయంలో కనకారావు సూట్‌కేసును తలకిందులుగా తిప్పాడు. నోట్ల కట్టలున్న బ్యాగు కిందకి వెళ్లి.. కాగితాల కట్టలున్న సంచి పైకి వచ్చింది. కొద్దిసేపటి తర్వాత బంగారం తీసుకొచ్చే వ్యక్తి రావడానికి సమయం పడుతుందని, సూట్‌కేసులో కాగితాల కట్టలున్న బ్యాగును బాధితునికి ఇచ్చి వెళ్లిపోయారు. మోసానికి పాల్పడ్డ ప్రధాన సూత్రధారి మహేశ్‌ను పోలీసులు అతని ఇంట్లోనే అరెస్టు చేశారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని