logo

ఇంటర్‌ చదివాడు.. ఎందరినో ముంచాడు!

హైటెక్‌సిటీ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తిని మాదాపూర్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి

Published : 28 Sep 2022 02:38 IST

మాదాపూర్‌, న్యూస్‌టుడే: హైటెక్‌సిటీ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తిని మాదాపూర్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ దీక్షిత తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ పట్నానికి చెందిన ప్రతాప్‌ కట్టమూరి(25) ఇంటర్‌ చదివాడు. ఆ తరువాత నగరానికి వచ్చి ఒకటి రెండు కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకున్నాడు. డాన్యన్‌ ఐటీ టెక్నాలజీ పేరిట ఓ కంపెనీ ఏర్పాటు చేశాడు. తన కంపెనీలో నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తానంటూ ఆన్‌లైన్‌లో ప్రకటనలు గుప్పించాడు. మూడు నెలల శిక్షణ ఆ తరువాత ఉద్యోగమంటూ మాయమాటలు చెప్పాడు. ఇది నమ్మిన నిరుద్యోగులు 200 మంది రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు చెల్లించారు. ఆన్‌లైన్‌లోనే మౌఖిక పరీక్షలు నిర్వహించి , ఒక్కోక్కరు ఆన్‌లైన్‌లోనే నిరుద్యోగుల నుంచి డబ్బులు కట్టించుకున్నాడు. 3 నెలలపాటు ఆన్‌లైన్‌లోనే శిక్షణ కార్యక్రమాలు చేపట్టాడు. శిక్షణ కాలంలో ఇవ్వాల్సిన స్టైఫండ్‌ ఇవ్వకపోగా తరువాత ఉద్యోగంలో చేర్చుకొని వేతనం ఇవ్వలేదు. బాధితులు  మాదాపూర్‌ పోలీసులను ఆశ్రయించగా కేసు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని