logo

ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగినికి బెదిరింపులు

ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే యువతిని పెళ్లి పేరుతో నమ్మించి.. ఫొటోలు, వీడియోలు బయటపెడతానంటూ బెదిరింపులకు దిగుతున్న ఓ యువకుడితో పాటు అతని కుటుంబ సభ్యులు,

Published : 28 Sep 2022 02:38 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే యువతిని పెళ్లి పేరుతో నమ్మించి.. ఫొటోలు, వీడియోలు బయటపెడతానంటూ బెదిరింపులకు దిగుతున్న ఓ యువకుడితో పాటు అతని కుటుంబ సభ్యులు, స్నేహితురాలిపై బంజారాహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లో నివసిస్తూ.. ఓ ఎయిర్‌లైన్స్‌ సంస్థలో సీనియర్‌ క్యాబిన్‌ క్రూ సిబ్బందిగా పనిచేస్తున్న యువతికి కొన్నాళ్ల క్రితం మహ్మద్‌ అఖిల్‌ పాషా పరిచయమయ్యారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. తరువాత అతడికి మరో యువతి దగ్గరైందని గుర్తించిన బాధితురాలు ప్రశ్నించగా తన వద్ద వ్యక్తిగత వీడియోలు ఉన్నాయంటూ, వాటిని బయటపెడతానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని