logo

కొండా లక్షణ్‌ ఆశయ సాధనకు కృషి: కలెక్టర్‌

ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని జిల్లా పాలనాధికారిణి నిఖిల అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా

Published : 28 Sep 2022 02:38 IST

లక్ష్మణ్‌ చిత్ర పటానికి  నివాళులు అర్పిస్తున్న ఎస్పీ కోటిరెడ్డి తదితరులు

వికారాబాద్‌ మున్సిపాలిటీ: ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని జిల్లా పాలనాధికారిణి నిఖిల అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ కారుడు కొండా లక్ష్మణ్‌ జీవితం అందరికీ ఆదర్శమన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి ఆయన నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారి అశోక్‌కుమార్‌, జిల్లా అధికారులు మల్లేశం, కోటాజి, రాజేశ్వర్‌, భీమారాజు పాల్గొన్నారు.

వికారాబాద్‌ మున్సిపాలిటీ, వికారాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ కృషి గొప్పదని జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) ఎన్‌.కోటిరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ బాపూజీ తెలంగాణ సాధన పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారన్నారు.ఇలాంటి మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా ఎస్పీ ఎంఎం. రశీద్‌, ఏఓ జేవీ వందన, డీఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు, ఆర్‌ఐలు రత్నం, అచ్యుతరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని