logo

పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తేవాలి: ఎమ్మెల్యే

జోనల్‌ స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో విద్యార్థులు మంచి ప్రతిభ చాటారని తెరాస జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. మంగళవారం పట్టణ పరిధి అనంతగిరి బాలురు సాంఘిక సంక్షేమ పాఠశాలలో మూడు

Published : 28 Sep 2022 02:38 IST

విజేతలతో ఎమ్మెల్యే ఆనంద్‌, కలెక్టర్‌ నిఖిల, అధికారులు

వికారాబాద్‌ టౌన్‌, న్యూస్‌టుడే: జోనల్‌ స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో విద్యార్థులు మంచి ప్రతిభ చాటారని తెరాస జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. మంగళవారం పట్టణ పరిధి అనంతగిరి బాలురు సాంఘిక సంక్షేమ పాఠశాలలో మూడు రోజులు నిర్వహిస్తున్న జోనల్‌ స్థాయి క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడల్లో ప్రతిభ చాటి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్ఠలు సాధించి పెట్టాలన్నారు. పాలనాధికారిణి నిఖిల మాట్లాడుతూ...విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే విజయాలు సాధిస్తారని అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి, హైదరాబాద్‌ గురుకులాల ప్రాంతీయ సమన్వయ కర్త డాక్టర్‌ శారద, ఏఆర్సీఓ శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక పీడీ చందర్‌, ప్రిన్సిపల్‌ అపర్ణ, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ను అండర్‌ 14, 17, 19 విభాగాల్లో శివారెడ్డిపేట విద్యార్థులు సాధించారు. అథ్లెటిక్స్‌లో వ్యక్తిగత చాంఫియన్లుగా అండర్‌ 14 విభాగంలో సత్యనారాయణ, అండర్‌ 17 విభాగంలో రాజేష్‌, అండర్‌ 19 విభాగంలో యాదగిరి (ఇబ్రహీం పట్నం) విజేతలుగా నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని