logo

మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని బహిష్కరించాలి: మల్‌రెడ్డి

మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని తెరాస నుంచి బహిష్కరించాలని, పదవి నుంచి తప్పించాలని సీఎం కేసీఆర్‌ను మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated : 29 Sep 2022 03:02 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని తెరాస నుంచి బహిష్కరించాలని, పదవి నుంచి తప్పించాలని సీఎం కేసీఆర్‌ను మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2015 నుంచి కిషన్‌రెడ్డి మీద హవాలా కేసులున్నాయని ఈడీ అంటోందని..ఆ డబ్బు ఎక్కడ్నుంచి వచ్చాయో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల కబ్జాలకు ఆయన పాల్పడ్డారని, సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని