logo

9 తీర్మానాలకు ఆమోదం

గ్రేటర్‌లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కార్పొరేట్‌ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచుతున్నామని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అన్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో....

Updated : 29 Sep 2022 03:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కార్పొరేట్‌ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచుతున్నామని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అన్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అనేక కార్పొరేట్‌ సంస్థలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులను భారీగా వెచ్చించాయన్నారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో బుధవారం మేయర్‌ అధ్యక్షతన జరిగిన స్థాయీ సంఘం సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారులు ప్రవేశపెట్టిన తొమ్మిది తీర్మానాలను ఆమోదించారు. అందులో సీఎస్‌ఆర్‌ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులు ఉన్నాయి. సమావేశంలో కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి, ఈఎన్‌సీ జియాఉద్దీన్‌, సీఈ దేవానంద్‌, అదనపు కమిషనర్లు శృతి ఓజా, బి.సంతోష్‌, విజయలక్ష్మి, జయరాజ్‌ కెనడి తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts