logo

కుండపోత.. రహదారులపై ఎదురీత

భాగ్యనగరాన్ని వరుణుడు వదలట్లేదు. వరుసగా మూడో రోజూ వర్షం కుండపోతగా కురిసింది. బుధవారం సాయంత్రం మొదలైన వాన రాత్రి వరకు ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో విధ్వంసం సృష్టించింది.

Published : 29 Sep 2022 03:38 IST


హయత్‌నగర్‌ ఆర్టీసీ డిపో వద్ద రహదారిపై వరద

ఈనాడు, హైదరాబాద్‌, కాటేదాన్‌, వనస్థలిపురం, మెహిదీపట్నం, న్యూస్‌టుడే: భాగ్యనగరాన్ని వరుణుడు వదలట్లేదు. వరుసగా మూడో రోజూ వర్షం కుండపోతగా కురిసింది. బుధవారం సాయంత్రం మొదలైన వాన రాత్రి వరకు ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో విధ్వంసం సృష్టించింది. మొదట ఎల్బీనగర్‌ ప్రాంతంలో కుండపోత మొదలైంది. సుష్మా, పనామా, చింతల కుంట కూడళ్లలో నీరు మోకాలు లోతున నిలవడంతో వాహనాలు ఆగుతూ ముందుకు కదలాయి. కాటేదాన్‌ వైపు నుంచి ఆరాంఘర్‌ చౌరస్తాకు వెళ్లే రోడ్డుపై రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద నీరు నిలిచి వాహనాలు మూడు గంటలపాటు నిలిచిపోయాయి. హయత్‌నగర్‌లో రాత్రి 9గంటల వరకు గరిష్ఠంగా 5సెం.మీ వర్షపాతం నమోదవగా, ఖాజాగూడలో 3.8, శివరాంపల్లిలో 3 సెం.మీ. వాన పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు