logo

గాంధీలో మహాత్ముని విగ్రహం ఏర్పాట్ల పరిశీలన

గాంధీ ఆసుపత్రి ఎదుట నూతనంగా ఏర్పాటు చేస్తున్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని అక్టోబరు 2న.. సీఎం కేసీఆర్‌ చేతులమీద ఆవిష్కరణ చేయనున్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు.

Published : 29 Sep 2022 03:38 IST


గాంధీ ఆసుపత్రి వద్ద పనులు పరిశీలిస్తున్న మంత్రులు హరీశ్‌రావు, తలసాని

గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: గాంధీ ఆసుపత్రి ఎదుట నూతనంగా ఏర్పాటు చేస్తున్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని అక్టోబరు 2న.. సీఎం కేసీఆర్‌ చేతులమీద ఆవిష్కరణ చేయనున్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం తలసాని శ్రీనివాసయాదవ్‌, డీఎంఈ రమేష్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజారావుతో కలిసి గాంధీ ఆసుపత్రి ఎదుట విగ్రహ ఏర్పాటు పనులను హరీశ్‌రావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఆసుపత్రి ఎదుట 16 అడుగుల గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండడం సంతోషదాయకమన్నారు. అక్టోబరు 2న సీఎం కేసీఆర్‌ ఆవిష్కరిస్తారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని