logo

బూటకపు నినాదాలతో రేపిస్టులను కాపాడుతున్న ప్రభుత్వం

నారీ శక్తి, బేటీ బచావో వంటి బూటకపు నినాదాలు ఇస్తూ ప్రధాని మోదీ మరోవైపు రేపిస్టులను కాపాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు,....

Published : 29 Sep 2022 03:38 IST


సంతకాల సేకరణలో పాల్గొన్న సీపీఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: నారీ శక్తి, బేటీ బచావో వంటి బూటకపు నినాదాలు ఇస్తూ ప్రధాని మోదీ మరోవైపు రేపిస్టులను కాపాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణలు ధ్వజమెత్తారు. గుజరాత్‌లో బిల్కిస్‌ బానో రేపిస్టులను విడుదల చేయడాన్ని తప్పుపడుతూ భారత జాతీయ మహిళా సమాఖ్య చేపట్టిన సంతకాల సేకరణను వారు బుధవారం సాయంత్రం లిబర్టీ కూడలి వద్ద ప్రారంభించారు. మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన, ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, నేతలు సదాలక్ష్మి, నళిని, ఛాయాదేవి, జంగమ్మ, లక్ష్మి, గిరిజ, మాధవిజ్యోతి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని