logo

Video game: సైక్లింగ్‌ చేస్తూ.. వీడియో గేమ్‌ ఆడేయొచ్చు!

ఇంట్లో వ్యాయామ సాధన చేసేందుకు బైక్‌లు అందుబాటులో ఉంటాయి. నిత్యం వాటిపై సైక్లింగ్‌ చేయాలంటే కొందరు అనాసక్తి ప్రదర్శిస్తుంటారు. అందుకే వ్యాయామానికి డుమ్మా కొడుతుంటారు..

Updated : 29 Sep 2022 08:05 IST


సైక్లింగ్‌ చేస్తూ..

ఈనాడు, హైదరాబాద్‌ : ఇంట్లో వ్యాయామ సాధన చేసేందుకు బైక్‌లు అందుబాటులో ఉంటాయి. నిత్యం వాటిపై సైక్లింగ్‌ చేయాలంటే కొందరు అనాసక్తి ప్రదర్శిస్తుంటారు. అందుకే వ్యాయామానికి డుమ్మా కొడుతుంటారు!. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి జోష్‌ ఇలియాస్‌ జాయ్‌ వినూత్న ఆలోచన చేశాడు. వ్యాయామ బైక్‌పై సైక్లింగ్‌ చేస్తూ వీడియోగేమ్‌ ఆడుతూ.. ఎంతో ఆసక్తితో కసరత్తులు చేయవచ్చని భావించాడు. 

ఏం చేశాడంటే?.. జోష్‌ ప్రస్తుతం ట్రిపుల్‌ఐటీలో ఎంటెక్‌ మొదటి ఏడాది ప్రాడక్టు డిజైన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (పీడీఎం) కోర్సు చేస్తున్నాడు. ఇటీవల జరిగిన హ్యాకడే.ఐవో పోటీలకు హాజరై విజేతగా నిలిచాడు. ఇందుకుగాను అతను పాత వ్యాయామ బైక్‌ను వైర్‌లెస్‌ గేమ్‌ ప్యాడ్‌గా మార్చారు. జోష్‌కు చిన్నప్పట్నుంచి వీడియోగేమ్‌లు ఆడటం ఎంతో ఇష్టం. ఇంట్లో సైక్లింగ్‌ చేసే సమయంలో బోర్‌ కొట్టకుండా వీడియోగేమ్‌లు ఆడేలా ఎక్స్‌ర్‌బైక్‌ను తయారు చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ఈఎస్‌పీ32 మైక్రో కంట్రోలర్‌ సాయంతో బైక్‌ను అనుసంధానం చేశాడు. సైక్లింగ్‌లో పెడల్‌ తొక్కుతుంటే వీడియో గేమ్‌లో కారు స్పీడ్‌ పెరిగేలా అనుసంధానించాడు. బైక్‌ హ్యాండిల్‌కు ఉన్న టచ్‌ ప్యాడ్స్‌ను కుడి, ఎడమ వైపునకు నడిపేలా ప్రత్యేక సెన్సర్లు ఏర్పాటు చేశాడు. టచ్‌ ప్యాడ్స్‌ వాస్తవానికి పల్స్‌ రేటు చూసేందుకు ఉపయోగపడతాయి. దీనికి ఇబ్బంది లేకుండా వీడియోగేమ్‌లో కారు దిశలను మార్చేలా రూపొందించాడు. జాయ్‌స్టిక్‌, ఇతర బటన్స్‌ యాడ్‌ చేశారు. ఇందుకు కేవలం రూ.1500 ఎలక్ట్రానిక్‌ పరికరాలు మాత్రమే వినియోగించాడు. ఎక్స్‌ర్‌బైక్‌కు ప్రత్యేకంగా స్క్రీన్‌ అమర్చడంతో పవర్‌ పాయింట్‌తో గోడపై స్క్రీన్‌ వచ్చేలా ఏర్పాట్లు చేశాడు. సైక్లింగ్‌ చేస్తుంటే వీడియో గేమ్‌లోని కారు కదులుతూ ఆట ఆడేందుకు వీలుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని