logo

Hyderabad: నటుడు మహేష్‌బాబు ఇంటి ప్రాంగణంలోకి దూకిన ఆగంతుకుడు

సినీ నటుడు మహేష్‌ బాబు నివాస ప్రాంగణంలోకి మంగళవారం రాత్రి ఓ ఆగంతుకుడు దూకాడు. ఎత్తయిన గోడపై నుంచి దూకడంతో తీవ్ర గాయాల పాలైన అతన్ని కాపలాదారులు గమనించి అదుపులోకి తీసుకొన్నారు.

Updated : 29 Sep 2022 07:07 IST


గాయపడిన వ్యక్తి

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: సినీ నటుడు మహేష్‌ బాబు నివాస ప్రాంగణంలోకి మంగళవారం రాత్రి ఓ ఆగంతుకుడు దూకాడు. ఎత్తయిన గోడపై నుంచి దూకడంతో తీవ్ర గాయాల పాలైన అతన్ని కాపలాదారులు గమనించి అదుపులోకి తీసుకొన్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.81లో మహేష్‌బాబు నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆయన నివాస ప్రాంగణంలో ప్రహరీ పక్కగా పెద్ద శబ్దం వచ్చింది. కాపలాదారులు వెళ్లి చూసి ఓ వ్యక్తి గాయాలపాలై పడి ఉండటం గుర్తించారు. వెంటనే అతన్ని పట్టుకొని విచారించడంతోపాటు జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. అతన్ని విచారించి.. మూడు రోజుల కిందట ఒడిశా నుంచి వచ్చినట్లు గుర్తించారు. సమీపంలో ఉన్న ఒక నర్సరీ వద్ద ఉంటున్నాడు. చోరీకని వచ్చి 30 అడుగుల గోడ పైనుంచి దూకాడు. నిందితుణ్ని కృష్ణ(30)గా గుర్తించారు. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో మహేష్‌బాబు నివాసంలో లేరు. కాపలాదారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని