logo

సికింద్రా‘బాధ’ లేకుండా పార్కింగ్‌

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌ 1 వైపు ప్రయాణికుల కోసం వచ్చే వాహనాలు ఎక్కడ నిలపాలో తెలియని గందరగోళానికి దక్షిణమధ్య రైల్వే చెక్‌ పెడుతోంది.  రూ.600కోట్లతో స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్న క్రమంలో పార్కింగ్‌ ఇబ్బందులు తొలగించడానికి సన్నాహాలు చేస్తోంది.

Updated : 29 Sep 2022 10:53 IST


రైల్వే స్టేషన్‌ను తీర్చిదిద్దనున్నారిలా..

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌ 1 వైపు ప్రయాణికుల కోసం వచ్చే వాహనాలు ఎక్కడ నిలపాలో తెలియని గందరగోళానికి దక్షిణమధ్య రైల్వే చెక్‌ పెడుతోంది.  రూ.600కోట్లతో స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్న క్రమంలో పార్కింగ్‌ ఇబ్బందులు తొలగించడానికి సన్నాహాలు చేస్తోంది.

మరో వంతెన..
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ చుట్టూ ఉన్న మెట్రో స్టేషన్లకు వచ్చే ప్రయాణికులతోపాటు.. రైల్వే స్టేషన్‌కు వచ్చే వారి వాహనాల పార్కింగ్‌ ప్రస్తుతం గందరగోళంగా ఉంది. స్టేషన్‌ను పునఃనిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులో ఈ ఇబ్బందులకు తెరదించాలని రైల్వే అధికారులు చూస్తున్నారు. రైల్వేస్టేషన్‌కు ఇరువైపులా బహుళ అంతస్తుల పార్కింగ్‌ భవనాలను నిర్మించి.. ఈ ఇబ్బందులను తొలగించాలని నిర్ణయించింది. రద్దీ పెరుగుతున్నందువల్ల ఒలిఫెంటా వంతెన కింద నుంచి వెళ్లడం కష్టతరమవుతున్న నేపథ్యంలో స్టేషన్‌కు ఇరువైపులకు కార్లు, ద్విచక్రవాహనాలు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా పట్టాలపై నుంచి ఒక వంతెన నిర్మించాలని భావిస్తోంది.

దక్షిణం వైపు నుంచి ప్రత్యేక దారి..
రైల్వే పట్టాలపై అటు-ఇటు వెళ్లడానికి వంతెన వేయడం అనేది వ్యయంతో కూడిన పని అనుకుంటే.. సికింద్రాబాద్‌ స్టేషన్లో పార్సిల్‌ బుకింగ్‌ వైపు ఉండే మార్గాన్ని విస్తరించి.. దక్షిణంవైపు ఉన్న రైల్వే అండర్‌ పాస్‌ నుంచి బోయిగూడ వైపు వాహనాలు వెళ్లేలా ఆలోచన చేస్తోంది. చిలకలగూడవైపు ఉన్న పాత క్వార్టర్లను కూల్చేసి చదును చేస్తున్నారు. అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని రైల్వే భావిస్తోంది. ఇక్కడ అపార్టుమెంట్లు నిర్మిస్తే.. అక్కడ ఉండబోయే వారికి స్టేషన్‌కు ఇరువైపులా దారి చూపించేందుకు కూడా ఈ మార్గాన్ని వినియోగించుకోడానికి వీలుగా నిర్మిస్తున్నారు. స్టేషన్‌ను అభివృద్ధి చేస్తూనే పార్కింగ్‌ ఇబ్బందులు తొలగించడంపై ముందుగా రైల్వే దృష్టి పెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని