logo

గజల్‌ శ్రీనివాస్‌కు లతా మంగేష్కర్‌ స్మృతి పురస్కారం

భారతరత్న, ప్రముఖ గాయని దివంగత లతా మంగేష్కర్‌ జయంతి సందర్భంగా ‘మైహోం ఇండియా, మహారాష్ట్ర’ ఆధ్వర్యంలో

Published : 29 Sep 2022 13:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతరత్న, ప్రముఖ గాయని దివంగత లతా మంగేష్కర్‌ జయంతి సందర్భంగా ‘మైహోం ఇండియా, మహారాష్ట్ర’ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పుణెలోని యశ్వంత్‌రావు చవాన్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ వేడుకల్లో లతా మంగేష్కర్‌పై ప్రముఖ గజల్‌ గాయకుడు, మూడు సార్లు గిన్నిస్‌ రికార్డు సాధించిన గజల్‌ శ్రీనివాస్‌ గజల్స్‌ ఆలపించారు. రాజేంద్రనాథ్‌ రెహబర్‌, కల్నర్‌ తిలక్‌రాజ్‌, రవికాంత్‌ అన్మోల్‌ రాసిన హిందీ, ఉర్దూ గజళ్లను ఆయన ఆలపించి లతా మంగేష్కర్‌కు నీరాజనం పలికారు. అనంతరం గజల్‌ శ్రీనివాస్‌ను నిర్వాహకులు ‘లతా మంగేష్కర్‌ స్మృతి పురస్కారం’తో సత్కరించారు. ఈ పురస్కారాన్ని భాజపా జాతీయ కార్యదర్శి, ఆ పార్టీ ఏపీ శాఖ సహ ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దియోదర్‌, ప్రముఖ మరాఠీ కళాకారుడు ప్రశాంత్‌ దామ్లే చేతుల మీదుగా అందజేశారు. పురస్కారంతో పాటు గజల్‌ శ్రీనివాస్‌కు రూ.21వేల పారితోషికం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని