Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ చట్టం కేసు.. తీర్పు రిజర్వ్‌ చేసిన సలహామండలి

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ చట్టం వ్యవహారంలో విచారణ జరిగింది. బేగంపేటలోని

Updated : 29 Sep 2022 16:59 IST

హైదరాబాద్‌: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ చట్టం వ్యవహారంలో విచారణ జరిగింది. బేగంపేటలోని గ్రీన్‌ల్యాండ్‌ అతిథి గృహంలో పీడీ చట్టం సలహామండలి సమావేశమై ఈకేసును విచారించింది. రాజాసింగ్‌పై పీడీ చట్టం నమోదు చేయడానికి గల కారణాలను, ఆధారాలను మంగళ్‌హాట్‌ పోలీసులు ఇప్పటికే పీడీ చట్టం సలహామండలికి అందించారు. చర్లపల్లి జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రాజాసింగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. రాజాసింగ్‌ భార్య ఉషాబాయి, ఆయన తరఫు న్యాయవాది కరుణాసాగర్‌ సలహా మండలి ఎదుట హాజరయ్యారు. తనపై అక్రమంగా పీడీ చట్టం నమోదు చేసినట్టు రాజాసింగ్‌ సలహామండలి ఎదుట వాదనలు వినిపించారు. రాజాసింగ్‌ సతీమణి ఉషాబాయి కూడా దీనిపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరు వైపులా వాదనలు విన్న పీడీ చట్టం సలహామండలి తీర్పును రిజర్వ్‌ చేసింది. 3..4 వారాల్లో దీనిపై తీర్పు వెలువడే అవకాశం ఉందని రాజాసింగ్‌ తరఫు న్యాయవాది తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని