logo

20 నుంచి గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌

ఆసియాలోనే అతిపెద్ద సదస్సు, ప్రదర్శనకు హైదరాబాద్‌ మూడోసారి అతిథ్యం ఇవ్వబోతుంది. అక్టోబరు 20 నుంచి 22 వరకు హైటెక్స్‌లో 20వ గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌-22ని నిర్వహిస్తున్నట్లు సీఐఐ- ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) తెలిపింది.

Published : 30 Sep 2022 03:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆసియాలోనే అతిపెద్ద సదస్సు, ప్రదర్శనకు హైదరాబాద్‌ మూడోసారి అతిథ్యం ఇవ్వబోతుంది. అక్టోబరు 20 నుంచి 22 వరకు హైటెక్స్‌లో 20వ గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌-22ని నిర్వహిస్తున్నట్లు సీఐఐ- ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) తెలిపింది. గురువారం తాజ్‌కృష్ణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐజీబీసీ హైదరాబాద్‌ ఛాప్టర్‌ ఛైర్మన్‌ సి.శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. సదస్సుకు 3వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు చెప్పారు.  హరిత భవనాల ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సదస్సు ఉపకరిస్తుందని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌.వెంకటగిరి తెలిపారు. తెలంగాణలో 514 ప్రాజెక్టులు రిజిస్టర్‌ అయ్యాయని తెలిపారు. వరల్డ్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో నిర్వహిస్తున్న ఆసియాలోనే అతిపెద్ద సదస్సు, ప్రదర్శన ఇది అని ఐజీబీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ ఎం.ఆనంద్‌ అన్నారు.  ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యుడు చిరాక్‌ బైజల్‌ తమ సంస్థ అనుభవాలను వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని