logo

గుండె జబ్బులపై అవగాహన కల్పించడం అభినందనీయం

గుండె జబ్బులపై అవగాహన కల్పించటం అభినందనీయమని కార్మిక మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి యాజమాన్యం, డెకెథ్లాన్‌ బైసైక్లింగ్‌ ఆఫ్‌ హైదారాబాద్‌,

Updated : 30 Sep 2022 04:40 IST

గుండె జబ్బులపై అవగాహన కల్పించటం అభినందనీయమని కార్మిక మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి యాజమాన్యం, డెకెథ్లాన్‌ బైసైక్లింగ్‌ ఆఫ్‌ హైదారాబాద్‌, సేవ్‌ ది యంగ్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గురువారం సైక్లింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు గుండెజబ్బులపై అవగాహన కల్పించారు. తొలుత ఆట, పాటలతో యువత ఉత్సాహాన్ని నింపారు. ప్రముఖ అథ్లెటిక్‌, ఎంఎల్‌ఆర్‌ విద్యాసంస్థల అధినేత మర్రి లక్ష్మణ్‌రెడ్డి,  మల్లారెడ్డి హెల్త్‌ సిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ భద్రారెడ్డి, మెడికల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

-న్యూస్‌టుడే, పేట్‌బషీరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని